అక్షరటుడే, వెబ్డెస్క్: Maharashtra Family Tragedy | కేవలం ఒక మొబైల్ ఫోన్ Phone విషయంలో మొదలైన చిన్నపాటి కుటుంబ family కలహం, ఆ ఇంట్లో తీరని శోకాన్ని మిగిల్చింది. కంటికి రెప్పలా పెంచుకున్న కొడుకును ప్రాణాలకు తెగించి కాపాడుకోబోయిన ఆ తల్లిదండ్రులు, చివరికి అతడితో పాటే అనంత లోకాలకు వెళ్ళిపోయిన హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Maharashtra Family Tragedy | మొబైల్ ఫోన్ గొడవ.. కొండ వద్దకు పరుగు
పోలీసుల కథనం ప్రకారం.. 19 ఏళ్ల కునాల్ చంద్గుడే మొబైల్ ఫోన్ వాడకం విషయంలో తన తల్లిదండ్రులు మురళీధర్, సంగీతలతో గొడవపడ్డాడు. కోపంతో ఊగిపోయిన కునాల్, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ సమీపంలోని ఖవ్డా కొండ వద్దకు వెళ్లాడు.
కొడుకు ఆగ్రహం చూసి కంగారుపడిన తల్లిదండ్రులు అతడిని వెతుక్కుంటూ కొండ వద్దకు చేరుకున్నారు. కొండ అంచున ఉన్న కొడుకును కిందకు దిగి రావాలని సుమారు మూడు గంటల పాటు కన్నీళ్లతో వేడుకున్నారు. అయితే, తన దగ్గరకు వస్తే కిందకు దూకేస్తానని కునాల్ హెచ్చరించడంతో, దిక్కుతోచని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.
Maharashtra Family Tragedy | ఘోర ప్రమాదం..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ముందుజాగ్రత్తగా కొండ కింద రక్షణ వలను (Safety Net) ఏర్పాటు చేశారు. అది గమనించిన కునాల్ కొండకు మరో అంచుకు వెళ్లాడు. కొడుకు ఎక్కడ ప్రాణాలు తీసుకుంటాడోనన్న భయంతో తండ్రి మురళీధర్ ప్రాణాలను పణంగా పెట్టి కొండపైకి వెళ్లాడు.
కొడుకును గట్టిగా పట్టుకుని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుండగా, ఊహించని విధంగా ఇద్దరు కూడా పట్టుతప్పి కొండపై నుంచి కిందకు పడిపోయారు. తీవ్ర గాయాలవ్వడంతో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Maharashtra Family Tragedy | కళ్లెదుటే ఇద్దరి ప్రాణాలు పోవడంతో తల్లి ఆత్మహత్య
కంటికి రెప్పలా చూసుకున్న భర్త, ఏకైక కొడుకు కళ్ల ముందే కొండపై నుంచి పడి రక్తమడుగులో శవాలుగా మారడం చూసి ఆ తల్లి సంగీత తట్టుకోలేకపోయింది.
Konda Sushmitha | తెలంగాణ కాంగ్రెస్లో కొండా కల్లోలం.. సుష్మిత తిరుగుబాటు వెనుక అసలు కథేంటి?
తీవ్ర దిగ్భ్రాంతికి, మానసిక వేదనకు గురైన ఆమె, క్షణికావేశంలో అదే కొండపై నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలపాలైన సంగీత కూడా అక్కడికక్కడే మృతి చెందింది.
ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, కొడుకు క్షణికావేశం ఒక కుటుంబాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాయని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.