Farmers Issue | రైతుల పరిస్థితి దారుణం.. ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం: కేసీఆర్

shashi kiran Mottala

అక్షరటుడే, హైదరాబాద్: Farmers Issue | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పాలనలో రాష్ట్ర రైతాంగం పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Farmers Issue | చిల్లర ప్రభుత్వం..

రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని కేసీఆర్ (KCR) విమర్శించారు. పండిన పంటను, ధాన్యాన్ని కొనుగోలు చేయడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. “ఇది ఒక చిల్లర ప్రభుత్వం.. వారు మాట్లాడే మాటలేంటి? రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు” అని మండిపడ్డారు.

Farmers Issue | ఎంపీల తీరుపై ఆగ్రహం..

పార్లమెంట్‌లో కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్య (MP Tejasvi Surya) తెలంగాణ గురించి అనుచితంగా మాట్లాడినా, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఎంపీలు అక్కడ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొందని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో ప్రస్తుత పాలకులు విఫలమయ్యారని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy | బీఆర్​ఎస్ శవంతో సమానం.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *