అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA Commissioner | గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో గల అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) రంగనాథ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.
అంజయ్యనగర్‌లో శనివారం మధ్యాహ్నం ఏడు అంతస్తుల భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంజయ్య నగర్‌లో భవనాలన్నీ నాలాల పక్కనే ఉన్నాయన్నారు. అక్రమంగా నిర్మించిన మరో 4 భవనాలు గుర్తించామన్నారు. వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవనం కూలడంతో డ్యామేజ్ అయిన జయదర్శిని అపార్ట్‌మెంట్‌ను నిపుణులతో పరీక్షిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే అపార్ట్‌మెంట్‌లో C బ్లాక్ కూల్చివేస్తామన్నారు. అపార్ట్‌మెంట్‌వాసులు సహకరించాలని కోరారు.
HYDRAA Commissioner | బిల్డర్‌పై చర్యలు
కూలిన భవనం కట్టిన బిల్డర్ హాస్టల్స్ నిర్మాణం చేస్తుంటాడని రంగనాథ్ తెలిపారు. అతడు చేసే నిర్మాణాలన్నీ ఇలానే ఉంటాయని తెలిసిందన్నారు. బిల్డర్‌పైనా చర్యలు తీసుకుంటామన్నారు. తక్కువ స్థలంలో 7, 8 ఫ్లోర్లు వేసి హాస్టల్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అంజయ్య నగర్‌లో 50, 60 గజాల స్థలంలో 7 అంతస్తుల వరకు నిర్మిస్తున్న అక్రమ హాస్టళ్లను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ నిర్మాణాలకు సంబంధించి బిల్డర్ సాదిక్ పరారీలో ఉన్నారని, అతని నిర్మాణాలన్నింటినీ తనిఖీ చేస్తామని తెలిపారు. గతంలో నోటీసులు ఇచ్చి కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన పేర్కొన్నారు.
#WATCH | Hyderabad, Telangana: AV Ranganath, HYDRA Commissioner, says, “A building which has 7+1, almost 8-storey building constructed in about 60 square yards of place. It came down this afternoon, and two bodies were retrieved. The building that came down was built on a ‘nala’… https://t.co/TG1LYkGUiJ pic.twitter.com/uBQjHZFiKh
— ANI (@ANI) August 22, 2026
ఇది కూడా చదవండి : BJP Protest | కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి పొంగులేటి రాజీనామాకు బీజేపీ డిమాండ్