Kamareddy Newborn Death | నవజాత శిశువు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కవిత

శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Newborn Death | కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. శిశువు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ మేరకు కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన ఎక్కపల్లి తండాకు చెందిన గర్భిణికి సకాలంలో డెలివరీ చేయకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

Kamareddy Newborn Death | పునరావృతం కాకుండా చూడాలి

శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు.

Rupareddy Murder | ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య.. ఇది ఒక్క నేరం కాదు.. మనందరికీ ఒక హెచ్చరిక

ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో జరిగిన ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరినట్లు సమాచారం.

శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *