Toxic Event Accident | టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం.. పలువురికి గాయాలు

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన టాక్సిక్​ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Toxic Event Accident | హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన టాక్సిక్​ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన భారీ సౌండ్ బాక్స్ సెటప్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ యువతి స్పృహ కోల్పోయినట్లు సమాచారం. దీంతో పోలీసులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Toxic Event Accident | భారీగా తరలివచ్చిన అభిమానులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Toxic Event Accident | కూలిన సౌండ్​ బాక్సులు

ఈవెంట్​ కొనసాగుతుండగా హీరో యశ్ వేదికపై మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఆయనను చూసేందుకు విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో ముందుకువచ్చారు. దీంతో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రాంగణంలోని ఫ్లడ్ లైట్ స్తంభం, భారీ స్పీకర్ బాక్సులు కిందపడిపోయాయి.

పలువురికి గాయాలు

ఘటనలో పలువురు విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని అంబులెన్స్​లో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

 

ఇది కూడా చదవండి..: Aug 23 Gold Prices | దూసుకుపోతున్న వెండి.. పసిడి పరిస్థితి ఏమిటంటే..

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *