అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 24 Market Analysis | అమెరికా (America), ఇరాన్‌ల మధ్య నెలకొన్న జియోపొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతున్నాయి. ఇది ఆర్థిక యుద్ధంగా మారుతోంది. ఇరాన్ Iranపై మరిన్ని ఆంక్షలకు సంబంధించి వాషింగ్టన్ నుంచి సోమవారం ప్రకటన వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) ఎక్కువగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Aug 24 Market Analysis | ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం..
చరిత్రలోనే అతిపెద్ద “సమన్వయ ఆర్థిక ఒంటరితనం” ప్రచారంలో భాగంగా ఇరాన్‌పై ఆంక్షలను ప్రకటించడానికి అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సోమవారం ఒక పత్రికా సమావేశం నిర్వహించనున్నారు.
“ఏ దేశంపైనైనా ఇప్పటివరకు తీసుకున్న అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్య” అని తాను అభివర్ణించిన దానిని వాషింగ్టన్ ఇరాన్‌పై విధిస్తుందని గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ కు ప్రాధాన్యత ఏర్పడింది.
Aug 24 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 0.43 శాతం, ఎస్ అండ్ పీ 0.43 శాతం లాభాలతో ముగియగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.10 శాతం లాభంతో ఉంది.
Aug 24 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.59 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.37 శాతం లాభాలతో ఉండగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ ఫ్లాట్‌గా ఉంది.
Aug 24 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.08 శాతం లాభంతో.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.39 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.85 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.52 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.24 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.06 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.37 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
Rupareddy Murder | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య.. ఇది ఒక్క నేరం కాదు.. మనందరికీ ఒక హెచ్చరిక
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 542 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 2,124 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 1 పైసలు బలపడి 95.71 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92.71 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.12 నుంచి 1.11 కు తగ్గింది.
- విక్స్ 4.01 శాతం తగ్గి 11.19 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.81 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.72 వద్ద ఉన్నాయి.