SRSP Inflow | ఎస్సారెస్పీకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

రెండు,మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాం సాగర్​ ప్రాజెక్ట్​కు ఇన్​ఫ్లో పెరుగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: SRSP Inflow | గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి ఇన్​ఫ్లో పెరుగుతోంది. మహారాష్ట్రలోనూ మోస్తరుగా వర్షాలు పడుతుండడంతో వరద వస్తోంది.

SRSP Inflow | 44 టీఎంసీల నీటి నిల్వ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం 1,013 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో సోమవారం 2,894 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,079.80 అడుగుల (44.489 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.  గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు (Sri Ram Sagar Project)లో 80.053 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం సుమారు 35.56 టీఎంసీల మేర తక్కువగా ఉంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 1,013 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,544 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.

ఇది కూడా చదవండి..: Gas Cylinder Auto | గ్యాస్​సిలిండర్​ ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *