అక్షరటుడే, వెబ్‌డెస్క్: High-Tech Engineers IPO | హై-టెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీకి హైడ్రాలిక్స్ పరిశ్రమలో 40 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఇది వివిధ పరిశ్రమలకు హైడ్రాలిక్ ఫిట్టింగ్‌లను తయారు చేసి సరఫరా చేస్తుంది.
డీఐఎన్ -మెట్రిక్, జేఐసీ, ఓఆర్ ఎఫ్ ఎస్ , కన్వర్షన్ మరియు కస్టమైజ్డ్ ఫిట్టింగ్‌లతో సహా 11 వేల రకాల ఉత్పత్తులను అందిస్తుంది. దీని ఉత్పత్తులను నిర్మాణ యంత్రాలు, ఆటోమొబైల్స్, వ్యవసాయ యంత్రాలు, ఇంజెక్షన్ మోల్డింగ్ యంత్రాలు, హైడ్రాలిక్ సిస్టమ్స్‌లో ఉపయోగిస్తారు.
High-Tech Engineers IPO | నాలుగు చోట్ల తయారీ కేంద్రాలు..
హై-టెక్ ఇంజనీర్స్ కంపెనీకి థానే, షిర్వాల్, కవతే, పిథంపూర్‌లలో తయారీ కేంద్రాలున్నాయి. వీటితో పాటు ఈ ప్లాంట్‌లకు ఫోర్జ్డ్ కాంపోనెంట్లను సరఫరా చేసే యూనిట్ నాసిక్ లో ఉంది.
High-Tech Engineers IPO | రూ. 135.73 కోట్ల ఐపీవో..
కంపెనీ రూ. 135.73 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో (IPO)కు వస్తోంది. ఇందులో రూ. 60 కోట్ల తాజా ఇష్యూ. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ యూనిట్ల విస్తరణ, మూలధన వ్యయాలు, రుణాలను పూర్తిగాకానీ పాక్షికంగాకానీ ముందుగానే చెల్లించడం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నారు.
ధరల శ్రేణి : కంపెనీ షేర్ల ధరల శ్రేణిని రూ. 50 నుంచి రూ. 53 మధ్యలో నిర్ణయించింది. ఒక లాట్‌లో 283 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,999 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 బిడ్లు వేయవచ్చు.
కోటా : క్యూఐబీలకు 50 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించింది.
జీఎంపీ : చిన్న ఐపీవో కావడంతో ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఒక్కో షేరుకు రూ. 25 ప్రీమియం ఉంది. ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలోనే 47 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఐపీవో తేదీలు : ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 24న ప్రారంభమైంది . ఆగస్టు 27 వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ ఆగస్టు 28న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 1న BSE, NSE లలో కంపెనీ షేర్లు లిస్ట్ కానున్నాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్