Lava Virat V1 Pro | లావానుంచి మరో బడ్జెట్ ఫోన్..

లావా కంపెనీ కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈనెల 31నుంచి సేల్ ప్రారంభం కానుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lava Virat V1 Pro | దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన లావా మరో కొత్త మోడల్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. లావా విరాట్ వీ 1 ప్రో 5జీ(LAVA Virat V1 Pro 5G) పేరుతో దీనిని విడుదల చేసింది.

అధునాతన ప్రాసెసర్, 600 ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో దీనిని తీసుకువచ్చింది. ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)తో పాటు లావా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 6.75 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1600 x 720 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
ఐపీ 64 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక్షన్ సర్టిఫికెట్‌తో వచ్చింది.

ప్రాసెసర్ : యునిసాక్ టీ 8200 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

Lava Virat V1 Pro | కెమెరా సెటప్..

వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.

Lava Virat V1 Pro | బ్యాటరీ సామర్థ్యం..

బడ్జెట్ ధరలో వచ్చిన ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్ : సిక్కిమ్ మిడ్ నైట్, స్పిటీ ఫ్రోస్ట్ కలర్లలో 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది. దీని ధర రూ. 15,999.

కార్డ్ ఆఫర్లు : ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 2 వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 2 వేల తక్షణ డిస్కౌంట్‌తోపాటు అదనంగా రూ. 700 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *