ఆర్థిక ఫలితాలను ప్రకటించిన స్ట్రింగ్ మెటవర్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్, గోద్రెజ్ ఆగ్రోవెట్!

Shivam nagarani

స్ట్రింగ్ మెటవర్స్ లిమిటెడ్ (BSE: META), కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BSE: 506395, NSE: COROMANDEL), గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (GAVL) కంపెనీలు 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికం (Q2), ప్రథమార్థం (H1) ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి.

స్ట్రింగ్ మెటవర్స్ లిమిటెడ్ (String Metaverse Limited):

ఆర్థిక వృద్ధి: హెచ్‌1 ఎఫ్‌వై27లో కార్యకలాపాల ద్వారా వచ్చే రెవెన్యూ 86.1% పెరిగి రూ.802.66 కోట్లకు చేరుకోగా, పన్ను తర్వాత నికర లాభం (PAT) 92.3% వృద్ధి చెంది రూ.76.79 కోట్లకు చేరింది.

క్యూ2 ఫలితాలు: క్యూ2 ఎఫ్‌వై27లో రెవెన్యూ 76.5% పెరిగి రూ.410.26 కోట్లకు, పన్ను తర్వాత లాభం 84.2% వరిగి రూ.39.86 కోట్లకు చేరుకుంది. కంపెనీ తన దృష్టిని ఏజెంటిక్ గేమింగ్ (Agentic Gaming), ఏఐ ఏజెంట్లకు పేమెంట్ రెయిల్స్ వైపు మరింతగా మారుస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ మీనావల్లి తెలిపారు.

కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Coromandel International Limited):

క్యూ2లో కంపెనీ రెవెన్యూ 6% వృద్ధిని (కన్సాలిడేటెడ్ రూ.10,348 కోట్లు) నమోదు చేయగా, ముడిసంచరు ధరల పెరుగుదల , మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ఎబిటా (EBITDA) 18% తగ్గి రూ.944 కోట్లకు, పీఏటీ (PAT) 34% తగ్గి రూ.523 కోట్లకు చేరుకుంది.

భవిష్యత్ ప్రణాళికలు: కొత్త ఎన్‌పీకే (NPK) ఫర్టిలైజర్ సామర్థ్యం క్యూ4 నాటికి పూర్తి కానుందని, రిటైల్ వ్యాపారంలో భాగంగా కొత్తగా 100 స్టోర్లను ఏర్పాటు చేసి నెట్‌వర్క్‌ను 1300 స్టోర్లకు పెంచినట్లు ఎండీ & సీఈఓ ఎస్. శంకరసుబ్రమణియన్ పేర్కొన్నారు.

గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (Godrej Agrovet Limited):

ద్విచక్ర వృద్ధి: క్యూ2 ఎఫ్‌వై27లో కంపెనీ రెవెన్యూ 17% బలమైన వద్ధితో రూ.2,995 కోట్లకు చేరుకుంది. అనిమల్ న్యూట్రిషన్ , ఆయిల్ పామ్ విభాగాల రాబడి 14%, 28% చొప్పున వృద్ధి చెందాయి. పన్ను తర్వాత లాభం (PAT) 22% పెరిగి రూ.103 కోట్లకు చేరింది.

వ్యూహాత్మక మార్పులు: ఎల్ నినో సవాళ్లు, ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ తమ డైవర్సిఫైడ్ ప్లాట్‌ఫారమ్ బలంగా రాణించిందని ఎండీ & సీఈఓ సునీల్ కటారియా తెలిపారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ విస్తరణ, ఖమ్మం కాంప్లెక్స్ ఏర్పాటు వంటి వ్యూహాత్మక వృద్ధి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *