TGEJAC Dharna Nizamabad | 27న టీజీఈజేఏసీ​ నిజామాబాద్​ ఆధ్వర్యంలో ధర్నా

టీజీఈజేఏసీ నిజామాబాద్ ఆద్వర్యంలో ధర్నాచౌక్​లో ఈనెల 27న ధర్నా నిర్వహించనున్నట్లు టీజీఈజేసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్​ అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: TGEJAC Dharna Nizamabad | టీజీఈజేఏసీ నిజామాబాద్ ఆద్వర్యంలో (Nizamabad) ఆధ్వర్యంలో ధర్నాచౌక్​లో ఈనెల 27న ఆందోళన నిర్వహించనున్నట్లు టీజీఈజేసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని సంఘం కార్యక్రమంలో మాట్లాడారు. TGEJAC

TGEJAC Dharna Nizamabad | టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో..

టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 27న ఉదయం పదిగంటలకు ధర్నా చౌక్​లో ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు. ఆరు పెండింగ్​ డీఏలను విడుదల చేయాలని.. రెండో పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ప్రతినెలా రూ. 2 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్​ చేశారు. సీపీఎస్​ను రద్దు చేసి, ఓపీఎస్​ను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం (NEHS) విధివిధానాలు అమలు చేసి తక్షణమే ఆరోగ్య సేవలు ప్రారంభించాలని కోరారు.

ఇలా మొత్తంగా 64 అంశాలతో కూడిన ఉద్యోగుల డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోతున్న మహా ధర్నాకు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్​సోర్సింగ్​ ఉద్యోగులందరూ హాజరుకావాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Turmeric Farmers Honoured | పసుపుబోర్డు కార్యాలయంలో రైతులకు గవర్నర్​ సన్మానం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *