అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖండించారు. మా మతం.. మేమే నిర్ణయిస్తామన్నారు. ఇస్లాంకు ఏది అవసరమో, ఏది కాదో నిర్ణయించేది న్యాయమూర్తులు కాదన్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి ఇటీవల హైకోర్టు (Allahabad High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. విద్యాసంస్థలు నిర్దేశించిన దుస్తుల నియమావళిని వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా మార్చుకునే హక్కు ఏ విద్యార్థికీ లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని పేర్కొంది. కోర్టు తీర్పుపై ఒవైసీ తాజాగా స్పందించారు. ఈ తీర్పును ఇస్లాంపై దాడిగా ఆయన అభివర్ణించారు.
Asaduddin Owaisi | బాలికల విద్యకు ఆటంకం
ఒవైసీ మాట్లాడుతూ.. శబరిమలకు సంబంధించిన తప్పనిసరి మతపరమైన ఆచారాల విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే విచారిస్తోందని ఒవైసీ అన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ విషయాన్ని విచారిస్తున్నప్పుడు, అలహాబాద్ న్యాయమూర్తులు దీనిపై తీర్పు ఇచ్చి ఉండకూడదని పేర్కొన్నారు. తలపాగా ధరించడం అనేది ఆమె ఇష్టం, గోప్యతకు సంబంధించిన విషయమన్నారు. ఈ తీర్పు బాలికల విద్యకు ఆటంకం కలిగిస్తుందని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి..: Kangana Ranaut Rahul Gandhi | “బ్రో.. కాస్త ఆగు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ సెటైర్!