Deputy CM CPRO | గుండెపోటుతో డిప్యూటీ సీఎం సీపీఆర్వో మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deputy CM CPRO | ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన సోమవారం అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

మధుసూదన్​ గతంలో ఈనాడు (Eenadu), ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా పని చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం సీపీఆర్వోగా నియమితులయ్యారు. సోమవారం మధ్యాహ్నం చాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స నిర్వహిస్తున్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

Deputy CM CPRO | భట్టి దిగ్భ్రాంతి

మధుసూదన్ మృతి పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాయితీ గల పాత్రికేయన్ని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Deputy CM CPRO | నివాళి అర్పించిన పొన్నం

మధుసూదన్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి  గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​ అన్నారు. మధుసూదన్ విద్యార్థి దశ నుంచి తనకు మంచి మిత్రుడని గుర్తు చేశారు. ఆయన మధుసూదన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

దీనిని కూడా చదవండి : Police Leave Policy | పోలీసులకు గుడ్​న్యూస్​.. ఆ రెండు రోజులు లీవ్​

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *