అక్షరటుడే, వెబ్డెస్క్: Nepal Floods | నేపాల్లో భోటె కోషి నది ఉప్పొంగడంతో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 95కు చేరినట్లు సమాచారం. మరో 579 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
Nepal Floods | విదేశీయులే అధికం
గల్లంతైన వారిలో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం 28 దేశాలకు చెందిన 466 మంది పర్యాటకులు ఆచూకీ లేకుండా పోయినట్లు సమాచారం. వీరిలో 105 మంది భారతీయులు, 33 మంది బ్రిటన్కు చెందినవారు ఉన్నట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి.
వరదల్లో గల్లంతైన మొత్తం 579 మందిలో 466 మంది విదేశీయులు కాగా, 113 మంది నేపాలీలు ఉన్నారు. భోటె కోషి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైనట్లు తెలుస్తోంది.
Nepal Floods | ఉద్ధృతంగా ప్రవాహాలు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణం, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నట్లు సమాచారం.
Nepal Flash Floods | నేపాల్లో భీకర వరదలు.. వేయి మందికి పైగా గల్లంతు!
భారతీయులు సహా పలువురు విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో వారి ఆచూకీ కోసం సంబంధిత అధికారులు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మృతుల సంఖ్య, గల్లంతైన వారి వివరాలపై అధికారికంగా మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.