Nizamabad Collector | అర్హుల ఓటు జాబితాలో ఉండేలా చూడాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Nizamabad Collector | అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. ఎస్​ఐఆర్​లో భాగంగా బీఎల్​వోలు పలువురికి నోటీసులు అందిస్తుండగా క్షేత్రస్థాయిలో కలెక్టర్​ ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు.

Nizamabad Collector | 19వ డివిజన్​లో..

నగరంలోని 19వ డివిజన్ పరిధిలో ఉన్న కంఠేశ్వర్​లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి నోటీసులు అందిస్తున్న విధానాన్ని కలెక్టర్​ (Collector Bhavesh Mishra) పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు అందుబాటులో ఉన్నారా లేదా అన్నది గమనించారు.  ధృవీకరణ అవసరం ఉన్న ఓటర్ల ఇంటింటి స్వయంగా వెళ్లి నోటీసులు అందించాలని, సూచించిన సమయానికి ఒకవేళ వారు రాలేకపోతే మరోమారు నోటీసు ఇవ్వాలని కలెక్టర్​ ఆదేశించారు. నోటీసు అందించే సమయంలోనే ఎవరైనా ఓటర్లు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే వాటిని స్వీకరించవచ్చని తెలిపారు. నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బీఎల్​వోలు సూపరింటెండెంట్​ మురళి, బీఎల్వోలు లావణ్య తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Banswada Road Accident | ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *