Delhi Model Murder | ఢిల్లీలో మోడల్ హత్య.. నిందితుడి అరెస్ట్​

ఢిల్లీకి చెందిన మోడల్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi Model Murder | ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మోడల్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల (ఎన్‌కౌంటర్) తర్వాత నిందితుడు ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో పోలీసులతో జరిగిన కాల్పుల సమయంలో ఇమ్రాన్ రెండు కాళ్ళలోనూ బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాల కారణంగా అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. మరొక వ్యక్తితో మాట్లాడటంపై ఆగ్రహంతో ఉన్న ఇమ్రాన్, తిలక్ నగర్ ప్రాంతంలోని ఆమె ఇంట్లో మోడల్​ ముస్కాన్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఆ యువతికి నిందితుడు సుమారు ఏడాదిన్నరగా పరిచయం ఉన్నాడు.

Delhi Model Murder | ఒంటరిగా ఉన్న సమయంలో..

ఆ యువతి వేరొకరితో మాట్లాడుతుండటంతో రెండు నెలలుగా నిందితుడు ఆమెపై కోపంతో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరగగా, ఆ తర్వాత ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేసి పారిపోయాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేశారు.

దీనిని కూడా చదవండి : Singareni Workers | సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్​ : కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *