Saif Ali Khan | సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నివాసంలో జరిగిన దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నివాసంలో జరిగిన దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన బంగ్లాదేశ్‌కు  చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తాను చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ముంబై ( Mumbai )సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Saif Ali Khan | నిందితుడు జరిపిన దాడిలో..

2025 జనవరి 16న ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్ ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఆయన అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి కుమారుడి గదికి వెళ్లాడు. కుటుంబ సభ్యులను కాపాడుకునే క్రమంలో సైఫ్ అతన్ని అడ్డుకోగా, నిందితుడు జరిపిన కత్తి దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించగా, శరీరంలో ఇరుక్కుపోయిన కత్తి ముక్కను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. కొద్ది రోజులు చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Saif Ali Khan | చట్టపరమైన చర్యలు ..

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నెల ప్రారంభంలో అదనపు సెషన్స్ జడ్జి నిందితుడిపై ఫారినర్స్ యాక్ట్‌తో పాటు ప్రాణాంతక ఆయుధంతో దాడి చేయడం, తీవ్ర గాయాలు చేయడం వంటి కఠినమైన సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. దీని ప్రకారం అతనికి గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

Saif Ali Khan | క్షమాభిక్ష కోరుతూ పిటిషన్..

ఈ నేపథ్యంలో 2026 ఆగస్టు 28న జరిగిన విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ, శిక్షా కాలంలో కొంత క్షమాభిక్ష ప్రసాదించాలని కోర్టును కోరాడు. నిందితుడి అభ్యర్థనపై స్పందించాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశించిన న్యాయస్థానం, విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. నిందితుడు స్వయంగా నేరం అంగీకరించడంతో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి:  Nepal Floods | వరదలు తట్టుకొని నిలబడిన భవనం.. ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *