Yellareddy development | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.వంద కోట్ల నిధులివ్వండి

ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy development | ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ (Yellareddy MLA) రావు కోరారు. ఈ మేరకు మంత్రి సీతక్కను (Minister Seethakka) కలిసి వినతిపత్రం సమర్పించారు.

Yellareddy development | అంగన్​వాడీ భవనాలు.. రహదారులు..

ఈ సందర్భంగా నియోజకవర్గంలో అంగన్‌వాడీ భవనాలు, రహదారులు, వంతెనలు, సీడీ వర్క్స్, స్పోర్ట్స్ స్టేడియం, గోడౌన్లకు రోడ్డు కనెక్టివిటీ అవసరముందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.. అలాగే నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో నూతన ఎంపీడీవో కార్యాలయ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. గాంధారి మండలం సంగెం రేవు వద్ద గాంధారి-లింగంపేట జడ్పీ రోడ్డుపై హెచ్​ఎల్​బీ వంతెన – రూ.4.90 కోట్లు, రామారెడ్డి మండలం గిద్దకు వెళ్లే ఆర్​అండ్​బీ రోడ్డుపై సీడీ వర్క రూ.కోటి, లింగంపేట మండలం కన్నాపూర్​ వెళ్లే పీడబ్ల్యూడీ రోడ్డుపై సీడీ వర్క్​, రూ.కోటి, లింగంపేట మండలం మోతే నుంచి రామలక్ష్మణపల్లి మీదుగా మోతే తండా వరకు బీటీ రోడ్డుకు రూ.4.00 కోట్లు ఇలా అభివృద్ధి పనులకు నిధులు అవసరం ఉందని పేర్కొన్నారు. మొత్తంగా రూ.100 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు.

ప్రతిపాదనలను పరిశీలించి వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం, ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణ, మహిళా-శిశు సంక్షేమ సదుపాయాలను బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: వైద్యవిద్య కోర్సుల ఫీజుల పెంపు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *