Kapra Lake | కాప్రా చెరువులో గ‌ణేశ్​ నిమ‌జ్జ‌నం చేయొద్దు : హైడ్రా

కాప్రా చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ కోరారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kapra Lake | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని సైనిక్​పురిలో గల కాప్రా చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైడ్రా (HYDRAA) కమిషనర్​ రంగనాథ్​ కోరారు. ఈ చెరువు సాధారణ నీటి వనరు మాత్రమే కాదు.. నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్ అని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిందన్నారు.

కాప్రా చెరువును హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఆ పనులను శనివారం కమిషనర్​ రంగనాథ్ (Ranganath)​ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరువులో గణేశ్​ నిమజ్జనం చేయొద్దని భాగ్య‌న‌గ‌ర్ ఉత్స‌వ క‌మిటీ స్థానిక ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు. చిన్న విగ్ర‌హాలు నిమ‌జ్జ‌నానికి (Ganesh Immersion) చెరువు చెంత ఉన్న బేబీ పాండ్‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. అర్బ‌న్ వెట్‌ల్యాండ్స్‌లో భాగంగా ఉన్న ఈ చెరువు ల‌క్ష్యాలు దెబ్బ‌తిన‌కుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు.

Kapra Lake | చెరువు అభివృద్ధికి..

కాప్రా చెరువులో 70 శాతం వ‌ర‌కూ ప్రైవేట్ ప‌ట్టా భూములు ఉన్నాయని రంగనాథ్​ అన్నారు. వారు ముందుకు వచ్చి చెరువు అభివృద్ధికి స‌హ‌క‌రించార‌న్నారు. కాప్రా లేక్ రివైవ‌ల్ గ్రూప్ ప్ర‌తినిధులు హైడ్రా క‌మిష‌న‌ర్​ను కలిసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల‌ని కోరారు. ఈ చెరువుకు ఆస్ట్రేలియా, యూరప్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి 470కు పైగా వలస పక్షులు ఇక్కడకు వస్తాయన్నారు. 113 ఎక‌రాల కాప్రా చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంద‌ని కమిషనర్​ పేర్కొన్నారు.

వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జీవవైవిధ్యం, పక్షుల ఆవాసం వంటి ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన అంశాల ప్రాతిప‌దిక‌న పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ సమయంలో చెరువులో నిమజ్జ‌నం స‌రికాద‌ని.. అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పెద్ద విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల‌ని ఉత్స‌వ క‌మిటీ ప్ర‌తినిధుల‌కు సూచించారు.

దీనిని కూడా చదవండి: Kyiv Drone Attack | ఉక్రెయిన్‌పై రష్యా భీకర డ్రోన్ దాడి.. 27 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *