Aug 30 Gold Prices | పసిడి ప్రియులకు ఊరట.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

ప్రపంచ మార్కెట్లలోనూ బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. స్పాట్‌ గోల్డ్‌ ధర సుమారు 24 డాలర్లు తగ్గడంతో ఔన్స్‌ ధర 4,453 డాలర్ల స్థాయికి చేరింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 30 Gold Prices | వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. దేశీయ బులియన్‌ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి.

అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్లలోనూ ఆ ప్రభావం కనిపించింది. ముఖ్యంగా వెండి ధర ఒక్కరోజులోనే కిలోకు రూ.5,000 మేర తగ్గడం గమనార్హం.

Aug 30 Gold Prices | హైదరాబాద్‌లో పసిడి ధరలు

హైదరాబాద్‌ Hyderabad బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,890 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.1,58,240 వద్దకు చేరింది.

22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా దిగివచ్చింది. 10 గ్రాములపై రూ.2,650 తగ్గడంతో ధర రూ.1,45,050గా నమోదైంది.

వెండి ధరలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కిలో వెండి ధర ఒక్కరోజులో రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది.

Aug 30 Gold Prices | విజయవాడ, విశాఖలోనూ తగ్గుదల

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన బులియన్‌ మార్కెట్లైన విజయవాడ, విశాఖపట్నంలోనూ బంగారం, వెండి ధరలు హైదరాబాద్‌ మార్కెట్‌ మాదిరిగానే ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.2,890 తగ్గి రూ.1,58,240కు చేరగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.2,650 తగ్గి రూ.1,45,050 వద్ద నమోదైంది. వెండి ధర కిలోకు రూ.5,000 తగ్గి రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.

Aug 30 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం

ప్రపంచ మార్కెట్లలోనూ బంగారం ధరలు ఒత్తిడికి లోనయ్యాయి. స్పాట్‌ గోల్డ్‌ ధర సుమారు 24 డాలర్లు తగ్గడంతో ఔన్స్‌ ధర 4,453 డాలర్ల స్థాయికి చేరింది.

KNRUHS Fee Hike | మెడికల్‌ విద్యార్థులకు షాక్‌.. యూనివర్సిటీ ఫీజులు భారీగా పెంపు

అలాగే స్పాట్‌ సిల్వర్‌ ధర సుమారు 0.98 శాతం తగ్గి ఔన్స్‌కు 66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన ఈ మార్పుల ప్రభావమే దేశీయంగా బంగారం, వెండి ధరలపై పడినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Aug 30 Gold Prices | ప్రధాన నగరాల వారీగా..

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,240గా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,050గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.2,60,000గా నమోదైంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,58,240, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,45,050గా ఉంది. కిలో వెండి ధర రూ.2,60,000గా కొనసాగుతోంది.

విశాఖ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,240గా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,050గా ఉంది. వెండి కిలో ధర రూ.2,60,000 వద్ద ఉంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *