అక్షరటుడే, వెబ్‌డెస్క్: PRTU TG Nizamabad | పీఆర్టీయూ టీజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అంబెల్లి శంకర్ ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి మోహన్‌రెడ్డిపై 11 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 358 ఓట్లు పోలయ్యాయి. అంబెల్లి శంకర్‌కు 184 ఓట్లు రాగా, మోహన్‌రెడ్డికి 173 ఓట్లు లభించాయి. దీంతో శంకర్ 11 ఓట్ల ఆధిక్యంతో జిల్లా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.
PRTU TG Nizamabad | ప్రధాన కార్యదర్శిగా కిషన్
అదేవిధంగా జి. కిషన్ 224 ఓట్లతో పీఆర్టీయూ టీజీ నిజామాబాద్ Nizamabad జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడటంతో శంకర్, కిషన్ అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.
Influencer Murder | ఇన్ఫ్లుయెన్సర్ను చెట్టుకు కట్టేసి.. నిప్పంటించి దారుణ హత్య
ఉపాధ్యాయుల సమస్యలు, వారి హక్కులు, ఉద్యోగ సంబంధిత అంశాలపై సంఘం తరఫున మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన జిల్లా నాయకత్వంపై ఉందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా, అంబెల్లి శంకర్‌ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై పలువురు ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. కొత్త కార్యవర్గం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.