Aug 31 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్ గా ఉండడంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 31 Market Analysis | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఆదివారం లారాక్ ద్వీపంలో ఇరాన్‌పై దాడి అమెరికా దళాలు చేశాయి. ప్రతిస్పందనగా జోర్డాన్‌లోని రెండు అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడికి దిగింది.

దీంతో క్రూడ్ ఆయిల్ ధరలకు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఆదివారం రాత్రి యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ క్షీణించాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ క్రితం ముగింపు స్థాయితో పోల్చితే డిస్కౌంట్‌తో ట్రేడ్ అవుతుండడంతో మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Central Cabinet Expansion | ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కూర్పు… గురి తెలంగాణపై?.. మోడీ టీమ్‌లో కొత్త తెలంగాణ ముఖాలు.. 2028 ‘మిషన్’ కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్!

Aug 31 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.52 శాతం, ఎస్ అండ్ పీ 0.25 శాతం నష్టపోƒయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.29 శాతం నష్టంతో ఉంది.

Aug 31 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.97 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.76 శాతం లాభంతో ఉండగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఫ్లాట్ గా ముగిసింది.

Aug 31 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.32 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.10 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.61 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.14 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.95 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.23 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.35 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 5,039 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 14వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,183 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి 95.38 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90.41 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.59 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.72 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.77 నుంచి 0.89 కి పెరిగింది.
  • విక్స్ 3.5 శాతం తగ్గి 10.68 వద్ద ఉంది.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *