అక్షరటుడే వెబ్‌డెస్క్: Veligonda Project | మార్కాపురం జిల్లా గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు. కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి, పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు నల్లమల్ల సాగర్‌కు నీటిని విడుదల చేశారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం (1996 మార్చి 5న) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే తొలి దశ ప్రారంభం కావడం విశేషం.
Veligonda Project | ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రయోజనాలు..
శ్రీశైలం జలాశయం నుంచి 43.53 టీఎంసీల కృష్ణా వరద జలాలను నల్లమల కొండల గుండా మళ్లించి, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. తొలి దశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,47,300 ఎకరాలకు (మార్కాపురం జిల్లాలో 3,08,700 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 27,400 ఎకరాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84,000 ఎకరాలు) సాగునీరు అందనుంది.
Veligonda తో రైతన్నకు కొత్త ఆశలు… కరువు నేలకు జలకళ
ఎన్నో ఏళ్ల కలకు అడుగులు పడుతూ… వెలిగొండ ఇప్పుడు సాకారం దిశగా!@ncbn #VeligondaProject #AndhraPradesh pic.twitter.com/AMcIO14I3W
— M9 NEWS (@M9News_) August 31, 2026
ఇది కూడా చదవండి: Modi Bishkek Visit | బిష్కెక్లో ప్రధాని మోదీ పర్యటన