Firecracker Factory Blast | యూపీలో తీవ్ర విషాదం.. బాణాసంచా కేంద్రం పేలి 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-కౌశాంబి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక లైసెన్స్‌డ్ బాణాసంచా తయారీ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Firecracker Factory Blast | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-కౌశాంబి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక లైసెన్స్‌డ్ బాణాసంచా తయారీ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది. కోఖ్‌రాజ్ పరిసర ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందగా, కర్మాగార భవనం పూర్తిగా నేలమట్టమైంది.

Firecracker Factory Blast | క్షతగాత్రుల వివరాలు..

పేలుడు ధాటికి శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోగా, 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులతో పాటు ప్రయాగ్‌రాజ్ స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Firecracker Factory Blast | కొందరి పరిస్థితి విషమం..

ఈ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇది కూడా చదవండి: Kavitha Nizamabad Visit | జిల్లాకు చేరుకున్న టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *