అక్షరటుడే వెబ్‌డెస్క్: Karur Vysya Bank Branches | కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) సోమవారం దేశవ్యాప్తంగా ఒకే రోజు 16 కొత్త శాఖలను ప్రారంభించి తన నెట్‌వర్క్‌ను 919కి విస్తరించింది. తమిళనాడులో 6, ఆంధ్రప్రదేశ్‌లో 5, తెలంగాణలో ( Telangana ) 3, కర్ణాటక, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లలో చొప్పున ఒక్కో శాఖను ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ విస్తరణలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు కొత్త శాఖలను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (జయభేరీ ఎన్క్లేవ్) శాఖను కేవీబీ ఎండీ & సీఈఓ రమేష్ బాబు స్వయంగా ప్రారంభించారు. అలాగే కోకాపేట (గోల్డెన్ మైల్ లేఅవుట్), ఇంద్రేషం (సంగారెడ్డి జిల్లా) ప్రాంతాల్లోని కొత్త శాఖలను స్థానిక ప్రముఖులు, వైద్యులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ తాజా చేర్పులతో తెలంగాణలో కేవీబీ శాఖల నెట్‌వర్క్ 68కి చేరుకుంది.
Karur Vysya Bank Branches | మెరుగైన సేవలు..
ఎంఎస్‌ఎంఈ, రిటైల్, వ్యవసాయ రంగాల కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకే ఈ విస్తరణ చేపట్టినట్లు కేవీబీ ఎండీ రమేష్ బాబు తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్‌తో పాటు వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన సేవలను అందించడంలో ఈ కొత్త శాఖలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Karur Vysya Bank Branches | డిజిటల్ సేవలు..
2026 జూన్ నాటికి కేవీబీ మొత్తం వ్యాపారం రూ. 2,27,267 కోట్లకు చేరగా, మొదటి త్రైమాసికంలో రూ. 756 కోట్ల నికర లాభాన్ని సాధించింది. మరోవైపు, ‘కేవీబీ డిలైట్’ మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లకు 150కి పైగా డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Moosarambagh Bridge | విశ్వనగరంగా హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి