అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Gains | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి. అయితే మన దేశ జీడీపీ గణాంకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంటోంది. నష్టాల్లోంచి లాభాల బాట పట్టింది.
Stock Market Gains | ఫ్లాట్ గా ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 37 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమైనా అక్కడినుంచి 230 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 430 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 3 పాయింట్ల గ్యాప్ డౌన్ తో ప్రారంభమై మరో 68 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 118 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 218 పాయింట్ల లాభంతో 77,180 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 24,124 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్స్ లాభాలతో, 17 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీసీ 3.26 శాతం, హెచ్సీఎల్ టెక్ 3.05 శాతం, కొటక్ బ్యాంక్ 2.09 శాతం, ఎయిర్‌టెల్ 1.82 శాతం, రిలయన్స్ 1.62 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 2.15 శాతం, ఇండిగో 1.62 శాతం, ఎస్బీఐ 1.60 శాతం, టైటాన్ 1.12 శాతం, సన్‌ఫార్మా 1.07 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Hi-Tech Engineers IPO | హైటెక్ ఇంజినీర్స్.. లిస్టింగ్ అదుర్స్