Kalyan Jewellers Rajahmundry | రాజమండ్రిలో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్.. గ్రాండ్‌గా ఓపెన్ చేసిన నాగార్జున ..

ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ రాజమండ్రిలోని మల్లినా నగర్‌లో తన నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kalyan Jewellers Rajahmundry | ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ రాజమండ్రిలోని   మల్లినా నగర్‌లో తన నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఈ షోరూమ్‌లో ముహూరత్ పెళ్లి ఆభరణాలు, ముద్ర యాంటిక్ జ్యువెలరీ, నిమః టెంపుల్ జ్యువెలరీ వంటి ప్రసిద్ధ హౌస్ బ్రాండ్‌లతో పాటు ఎన్నో అద్భుతమైన డిజైన్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని అందించేలా షోరూమ్‌ను విలాసవంతంగా తీర్చిదిద్దారు.

Kalyan Jewellers Rajahmundry | గొప్ప ఆదరణ..

ఈ ప్రారంభోత్సవంలో అక్కినేని నాగార్జున ( Nagarjuna )మాట్లాడుతూ.. నమ్మకం, పారదర్శకత, వినియోగదారులకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే కళ్యాణ్ జ్యువెలర్స్‌తో ప్రయాణం చేయడం గౌరవంగా ఉందని, రాజమండ్రి ప్రజలు ఈ బ్రాండ్‌కు గొప్ప ఆదరణ ఇస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త షోరూమ్ ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చే సమగ్ర షాపింగ్ వేదికను సృష్టించామని కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ పేర్కొన్నారు.

Kalyan Jewellers Rajahmundry | ప్రత్యేక ఆఫర్లు ..

షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆభరణాల ‘వాల్యూ యాడిషన్’పై 30% ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నారు. మార్కెట్‌లో అత్యంత తక్కువగా, అన్ని షోరూమ్‌లలో ఒకే విధంగా ఉండే స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేటు పరిమిత కాలం పాటు వర్తిస్తుంది. ఇక్కడ విక్రయించే ప్రతి ఆభరణం బిఐఎస్ హాల్‌మార్క్ కలిగి ఉంటుంది. బంగారం స్వచ్ఛతకు భరోసాతో పాటు జీవితకాల ఉచిత నిర్వహణ, పూర్తి ఉత్పత్తి సమాచారం, పారదర్శక మార్పిడి, బై-బ్యాక్ విధానాలతో కూడిన 4-అంచెల హామీ పత్రాన్ని అందిస్తారు.

Kalyan Jewellers Rajahmundry | ప్రధాన బ్రాండ్లు..

ఈ షోరూమ్‌లో ముహూరత్, ముద్ర, నిమఃతో పాటు గ్లో (డ్యాన్సింగ్ డైమండ్స్), జియా (సోలిటైర్ వజ్రాలు), అనోఖి (అన్కట్ డైమండ్స్), అపూర్వ (ప్రత్యేక సందర్భాల వజ్రాలు), అంతర (పెళ్లి వజ్రాలు), హీరా (డైలీ వేర్ డైమండ్స్), రంగ్ (కలర్ స్టోన్ జ్యువెలరీ) , ఇటీవల ప్రారంభించిన లీల (కలర్ స్టోన్స్, డైమండ్స్ కలెక్షన్) వంటి విభిన్న రకాల ఆభరణాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Sneha Society Services | స్నేహా సొసైటీ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *