Priya Adhikari Rescue | ఆరు రోజుల్లో 100 రెస్క్యూ మిషన్లు.. విపత్తు బాధితులకు ప్రాణదాత కెప్టెన్‌ ప్రియా అధికారి

ఆరు రోజుల్లో దాదాపు 100 రెస్క్యూ మిషన్లు నిర్వహించడం ద్వారా ప్రియా అధికారి సాహసానికి, సేవాభావానికి ప్రతీకగా నిలిచారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Priya Adhikari Rescue | ప్రకృతి విపత్తు సమయంలో ప్రాణాలను కాపాడేందుకు సాహసోపేతంగా ముందుకు వచ్చారు నేపాల్‌ Nepal కు చెందిన తొలి మహిళా హెలికాప్టర్‌ కెప్టెన్‌ ప్రియా అధికారి (40). వరుసగా ఆరు రోజుల పాటు నిర్విరామంగా సహాయక చర్యల్లో పాల్గొన్న ఆమె.. దాదాపు 100 రెస్క్యూ మిషన్లు నిర్వహించి వందలాది మంది ప్రాణాలను కాపాడారు.

Priya Adhikari Rescue | హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు

విపత్తు కారణంగా కొండ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించడంతో బాధితులను చేరుకోవడం సవాలుగా మారింది. అయినప్పటికీ ప్రియా అధికారి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఎత్తైన పర్వత ప్రాంతాలతో పాటు బురదమయమైన, ఇరుకైన మార్గాల్లోనూ హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూనే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు.

Lionel Messi Retirement | ఒక శకం ముగిసింది: అంతర్జాతీయ ఫుట్​బాల్‌కి లియోనెల్ మెస్సీ గుడ్​బై

గంటల తరబడి విమానాలు నడుపుతూ, అలసటను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రియా.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచారు. ఆమె చూపిన ధైర్యం, అంకితభావం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

Priya Adhikari Rescue | ఎందరికో స్ఫూర్తి..

‘‘ఇలాంటి విపత్తును నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా ప్రజలను రక్షించాలనే లక్ష్యంతో పనిచేశాం’’ అని ప్రియా అధికారి పేర్కొన్నారు.

ఆరు రోజుల్లో దాదాపు 100 రెస్క్యూ మిషన్లు నిర్వహించడం ద్వారా ప్రియా అధికారి సాహసానికి, సేవాభావానికి ప్రతీకగా నిలిచారు. విపత్తు వేళ ఆమె చూపిన తెగువ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ ఎందరికో స్ఫూర్తిగా మారింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *