Kavitha Panchajanya Sankalpam | పాంచజన్య సంకల్పం: భావోద్వేగాల వెనుక కవిత అసలు ‘పొలిటికల్ గేమ్‌ ప్లాన్’ ఏమిటి?

ఇప్పటివరకు పార్టీ నుంచి బయటకు వచ్చాక కేటీఆర్, హరీష్ రావుతోపాటు భారాస పార్టీ శ్రేణులపై పరోక్షంగా ఉన్న వ్యాఖ్యలు, ఈ సభతో సరికొత్త రంగు పులుముకున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Panchajanya Sankalpam | నిజామాబాద్ Nizamabad గడ్డపై టీఆర్‌ఎస్ (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కన్నీళ్లు, సెంటిమెంట్, బీఆర్‌ఎస్ (BRS) నాయకత్వంపై పరోక్ష దాడుల నడుమ సాగిన ఈ సభ… సాధారణ బహిరంగ సభ మాత్రమే కాదు, కవిత రాజకీయ పునరాగమనానికి (Political Comeback) వేసుకున్న వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది.

Kavitha Panchajanya Sankalpam | ‘నిజామాబాద్’నే ఎందుకు వేదికగా ఎంచుకున్నారు?

రాజకీయాల్లో సెంటిమెంట్ కంటే సురక్షితమైన స్థావరం మరొకటి ఉండదు.

మమకారం & సవాలు: నిజామాబాద్ కవితకు మెట్టినిల్లు. ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు, ఆపై ఓటమి చూశారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.

స్థానిక పట్టు: తన రాజకీయ ఉనికిని బలంగా ప్రదర్శించడానికి, క్యాడర్‌ను తనవైపు తిప్పుకోవడానికి నిజామాబాద్‌ కంటే అనుకూలమైన వేదిక లేదని ఆమె భావించారు. గతంలో పార్టీ స్థాపన ప్రకటనకు కూడా ఇదే వేదిక కావడం గమనార్హం.

Kavitha Panchajanya Sankalpam | ‘పాంచజన్యం’ హామీల వర్షం వెనుక సాధ్యసాధ్యాలు?

సభ వేదికగా కవిత ‘పాంచజన్యం’ పేరుతో ఐదు సంక్షేమ ప్రాధాన్యాలను ప్రకటించారు.

  • ఉచిత వైద్యం: ప్రభుత్వ, ప్రైవేట్ తేడా లేకుండా ఉచిత వైద్యం.
  • ఉచిత విద్య: కేజీ టూ పీజీ వరకు ప్రభుత్వ/ప్రైవేట్ విద్య ఉచితం.
  • రైతు సంక్షేమం: రైతును రాజును చేసే దిశగా ఆర్థిక, సాగు మద్దతు.
  • ఉద్యోగాలు & ఉపాధి: అమరుల కుటుంబాలు, ఉద్యమకారుల కోసం సూపర్‌న్యూమరరీ పోస్టులతో పాటు 1 లక్ష ఉద్యోగాలు, మొత్తం 4 లక్షల ఉద్యోగాల భర్తీ. యువత వ్యాపారాల కోసం ₹2 లక్షల నుంచి ₹20 కోట్ల వరకు రుణ ప్రణాళిక.
  • సామాజిక న్యాయం: ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం.

రాజ్యమేలాలనే తపన ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీ ఇచ్చే సాధారణ ఉచిత వాగ్దానాల మాదిరిగానే ఇవీ ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ రంగంలో సైతం ఉచిత విద్య, వైద్యం అందించడం, కోట్లాది రూపాయల రుణాలు ఇవ్వడం ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్నార్థకం.

Kavitha Panchajanya Sankalpam | ప్రశాంత్ రెడ్డిపై దాడి.. సింపతీ కార్డా? సొంత ఇంటి శత్రుత్వమా?

ఇప్పటివరకు పార్టీ నుంచి బయటకు వచ్చాక కేటీఆర్, హరీష్ రావుతోపాటు భారాస పార్టీ శ్రేణులపై పరోక్షంగా ఉన్న వ్యాఖ్యలు, ఈ సభతో సరికొత్త రంగు పులుముకున్నాయి. తొలిసారిగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కవిత నేరుగా టార్గెట్ చేశారు.

“నేను నా కుటుంబానికి దూరమవ్వడానికి, పార్టీ వీడటానికి మూలకారణం వేముల ప్రశాంత్ రెడ్డే” అని కవిత చేసిన తీవ్ర ఆరోపణ నిజామాబాద్ బీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Priya Adhikari Rescue | ఆరు రోజుల్లో 100 రెస్క్యూ మిషన్లు.. విపత్తు బాధితులకు ప్రాణదాత కెప్టెన్‌ ప్రియా అధికారి

సెంటిమెంట్ ఆయుధం: వేముల ప్రశాంత్ రెడ్డి పేరును ప్రస్తావించడం వెనుక స్థానిక నాయకత్వంపై ప్రజలకు ఉన్న అసంతృప్తిని తనవైపు తిప్పుకోవడం ఒక వ్యూహం కావచ్చు.

బాధ్యత బదిలీ: కుటుంబానికి, పార్టీకి దూరం కావడానికి తనే కారణం కాదని, ఇతరుల కుట్రల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చూపించడం ద్వారా ‘సింపతీ గెయిన్’ (సానుభూతి) సాధించేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది.

Kavitha Panchajanya Sankalpam | టీఆర్‌ఎస్ ప్రస్థానం ముందుకు సాగేనా?

కవిత ప్రకటించిన ‘పాంచజన్యం’ ఎజెండా క్షేత్రస్థాయిలో ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? గులాబీ దళం నుంచి బయటపడి వేరుకుంపటి పెట్టుకున్న కవిత, సొంత జిల్లాలోని నాయకులపై చేస్తోన్న విమర్శలు ఆమెకు రాజకీయంగా లాభిస్తాయా.. లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *