Fake Doctors Medchal | నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. ఐదుగురు నకిలీ వైద్యుల పట్టివేత!

మేడ్చల్ ప్రాంతంలో ఇద్దరు నకిలీ వైద్యులు పట్టుబడగా, జగద్గిరిగుట్ట, పేట్‌బషీరాబాద్, సూరారం ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరో ముగ్గురు పట్టుబడ్డారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fake Doctors Medchal | మేడ్చల్ జిల్లా పరిధి గ్రేటర్​ హైదరాబాద్​ Hyderabad లో అర్హతలు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్న నకిలీ వైద్యుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్ డివిజన్ ఎస్‌ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించగా మొత్తం ఐదుగురు నకిలీ వైద్యులు పట్టుబడ్డారు.

Fake Doctors Medchal | వైద్య అర్హతలు లేకుండానే చికిత్స

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే ప్రజలకు చికిత్స అందిస్తూ, అక్రమంగా మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా వైద్య సేవలు నిర్వహిస్తున్న వ్యక్తులపై కొంతకాలంగా ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో ఆయా ప్రాంతాల్లో దాడులు చేపట్టారు.

ఈ దాడుల్లో మేడ్చల్ ప్రాంతంలో ఇద్దరు నకిలీ వైద్యులు పట్టుబడగా, జగద్గిరిగుట్ట, పేట్‌బషీరాబాద్, సూరారం ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరో ముగ్గురు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో మోత్కూరి సుధాకర్ చారి, రామగోని అంజయ్యగౌడ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Fake Doctors Medchal | నిందితులపై కేసు నమోదు..

అర్హతలు లేకుండానే వైద్యం చేయడం, రోగులకు చికిత్స అందించడం, మందులను అక్రమంగా విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Kavitha Panchajanya Sankalpam | పాంచజన్య సంకల్పం: భావోద్వేగాల వెనుక కవిత అసలు ‘పొలిటికల్ గేమ్‌ ప్లాన్’ ఏమిటి?

నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నకిలీ వైద్యుల కారణంగా ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వారిపై మరింత నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పదంగా వైద్య సేవలు అందించే వ్యక్తుల వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *