Balaji Nayak Case | ఎమ్మెల్యే, మంత్రిపై దూషణకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు.. బీజేపీ కార్యకర్తపై కేసు

ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, నిరసనకు సంబంధించిన వీడియోను చిత్రీకరించినట్లు కూడా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Balaji Nayak Case | రాజకీయ నిరసన సందర్భంగా రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడంతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, మంత్రిని అసభ్య పదజాలంతో దూషించి, రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలపై బీజేపీ కార్యకర్త బాలాజీ నాయక్‌తో పాటు మరికొందరిపై నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Balaji Nayak Case | ట్రాఫిక్‌కు అంతరాయం..

పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 31న ఉదయం 11 గంటల సమయంలో నిజామాబాద్‌లోని గాంధీనగర్ మెయిన్ రోడ్డుపై బాలాజీ నాయక్, ఇతరులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుకోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదే సమయంలో బాలాజీ నాయక్ ఎమ్మెల్యే, మంత్రిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, నిరసనకు సంబంధించిన వీడియోను చిత్రీకరించినట్లు కూడా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Balaji Nayak Case | అసభ్య పదజాలంతో దూషించడం..

ఈ ఘటనపై మాల్కాపూర్ తండాకు చెందిన నునావత్ సురేశ్ (33) సెప్టెంబరు 1న సాయంత్రం 4 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిజామాబాద్ Nizamabad రూరల్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.352/2026గా కేసు నమోదు చేశారు.

PDS Rice Seized | మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత

నిందితులపై BNS సెక్షన్లు 296(b), 126(2), 352 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసభ్య పదజాలంతో దూషించడం, వ్యక్తులు, వాహనాలను అడ్డుకోవడం, శాంతిభద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతో అవమానించడం, రెచ్చగొట్టడం వంటి ఆరోపణలకు సంబంధించిన నిబంధనల కింద కేసు నమోదైంది.

కేసు నమోదు అనంతరం ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *