Bhuma Rao ASI Retirement | రిటైర్డ్ ఏఎస్ఐ భూమారావుకు ఘన సన్మానం

బాధ్యతలను అంకితభావంతో, క్రమశిక్షణతో నిర్వర్తించి, సహచరులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhuma Rao ASI Retirement | నిజామాబాద్ Nizamabad రీజినల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన మాక్లూర్ భూమారావు ఏఎస్ఐకి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దురిశేటి రఘు చందర్, జోనల్ సబ్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణారెడ్డి, హన్మాగౌడ్‌తో పాటు ఇతర ఇంటెలిజెన్స్ సిబ్బంది భూమారావును శాలువా, పూలమాలలతో సత్కరించారు.

Bhuma Rao ASI Retirement | నిరంతరం పరివర్తన చెందాలి

ఈ సందర్భంగా రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దురిశేటి రఘు చందర్ మాట్లాడుతూ.. భూమారావు విధి నిర్వహణలో అందించిన సేవలను కొనియాడారు. బాధ్యతలను అంకితభావంతో, క్రమశిక్షణతో నిర్వర్తించి, సహచరులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

Balaji Nayak Case | ఎమ్మెల్యే, మంత్రిపై దూషణకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు.. బీజేపీ కార్యకర్తపై కేసు

ప్రస్తుతం పోలీసు శాఖ ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు అనుగుణంగా సిబ్బంది నిరంతరం పరివర్తన చెందాలని రఘు చందర్ సూచించారు. సాంకేతికత, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.

పదవీ విరమణ అనంతరం భూమారావు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఇంటెలిజెన్స్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *