India Defence | సైనిక బలాన్ని పెంచుతున్న భారత్.. రక్షణ రంగ వ్యయంలో నయా రికార్డ్.

Balla Sandeep Kumar

అక్షరటుడే, న్యూఢిల్లీ: India Defence | గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్‌ (Global Defense Market)లో భారత్ తన బలాన్ని మరింత పెంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ పరిశోధక సంస్థ ‘సిప్రి’ (SIPRI) విడుదల చేసిన 2025 నివేదిక ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

India Defence | స్వదేశీ రక్షణ పరిజ్ఞానం:

గత ఏడాదితో పోలిస్తే భారత్ (India) తన సైనిక వ్యయాన్ని భారీగా పెంచింది. 2025లో మన దేశం రక్షణ రంగం కోసం 92.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇది 2024 నాటి వ్యయం కంటే 8.9 శాతం అధికం కావడం గమనార్హం. సరిహద్దు భద్రతను పటిష్టం చేయడంతో పాటు స్వదేశీ రక్షణ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో భాగంగానే భారత్ ఈ స్థాయిలో నిధులను కేటాయిస్తోంది.

India Defence | ప్రపంచ దేశాల ఖర్చు ఇలా..

ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.

అమెరికా: 954 బిలియన్ డాలర్లతో మొదటి స్థానం.

చైనా: 336 బిలియన్ డాలర్లతో రెండో స్థానం.

రష్యా: ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 190 బిలియన్ డాలర్ల వ్యయంతో మూడో స్థానం.

జర్మనీ: 114 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

India Defence | గ్లోబల్ ట్రెండ్స్:

మొత్తంగా 2025లో ప్రపంచవ్యాప్త రక్షణ వ్యయం 2,887 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2.9 శాతం ఎక్కువ. ముఖ్యంగా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఐరోపా దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను ఏకంగా 14 శాతం పెంచాయి. ఇక పొరుగు దేశం పాకిస్థాన్ 11.9 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ జాబితాలో 31వ స్థానానికి పరిమితమైంది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఇది కూడా చదవండి..: Sridhar Vembu letter | అమెరికా నుంచి వచ్చేయండి.. జోహో శ్రీధర్ వేంబు ఎమోషనల్ లెటర్ వైరల్!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *