National Nutrition Week | పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం..

పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని మెడికవర్​ హాస్పిటల్స్​ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ ఆనంద్ మాలు డైటీషియన్ శ్రీలేఖ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: National Nutrition Week | పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని మెడికవర్​ హాస్పిటల్స్​ (Medicover Hospitals) జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ ఆనంద్ మాలు (Dr. Anand Malu), డైటీషియన్ శ్రీలేఖ అన్నారు. సెప్టెంబర్ 1 నుండి 7 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘జాతీయ పోషణ వారోత్సవాలు’ (National Nutrition Week) సందర్భంగా హాస్పిటల్​లో మాట్లాడారు.

National Nutrition Week | జీవనశైలే వ్యాధులకు కారణం..

మన జీవనశైలే సర్వరోగాలకు కారణమని వైద్యుడు ఆనంద్ మాలు అన్నారు. నేటి జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల టైప్-2 మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు (బీపీ), గుండె సంబంధిత సమస్యలు, ఊబకాయం వంటి వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి, తరచూ ఇన్​ఫెక్షన్లు బారిన పడే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఏడాదికి ఒకసారైనా విటమిన్ డీ, విటమిన్ బీ–12, ఐరన్, హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించుకోవాలని తెలిపారు. ప్యాక్ చేసిన, జంక్ ఫుడ్, మితిమీరిన ఉప్పు, నూనె, చక్కెర కలిగిన పదార్థాలను తగ్గించాలని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా నడక తప్పనిసరి అని సూచించారు.

National Nutrition Week | ప్లేట్ పద్ధతిలో పోషకాలు సమకూరాలి

డైటీషియన్ శ్రీలేఖ మాట్లాడుతూ పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదని, మనకు స్థానికంగా లభించే సహజ సిద్ధమైన పదార్థాలతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన తెలిపారు. ప్రతిరోజూ ఆహారంలో పప్పు ధాన్యాలు, గుడ్లు, పనీర్, మొలకెత్తిన విత్తనాలు ఉండేలా చూసుకోవాలన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. రోజువారీ భోజనంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు కాల అనుగుణంగా లభించే పండ్లను తీసుకోవాలన్నారు.

రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగాలని సూచించారు. అలాగే మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం తరపున సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ ఆస్పత్రి ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పోషకాహార కౌన్సెలింగ్ హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకుని సూచించారు.

ఇది కూడా చదవండి..: Bigala Ganesh Gupta | కాంగ్రెస్​ నయవంచక పాలనను ఎండగడతాం..: మాజీ ఎమ్మెల్యే బిగాల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *