అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Gains | ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతున్నాయని రాబోయే డేటా నిర్ధారిస్తే తాను వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడానికి మద్దతు ఇస్తానని యూఎస్ ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ పేర్కొన్నారు.
దీంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకుని లాభాలబాటలో సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ సైతం పెరిగాయి. కొంతకాలంగా రూపాయి విలువ బలపడుతుండడమÖ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది.
Stock Market Gains | గ్యాప్ అప్ లో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 505 పాయింట్ల భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా తొలుత అమ్మకాల ఒత్తిడితో 128 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 354 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 15 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 110 పాయిట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 680 పాయింట్ల లాభంతో 76,833 వద్ద, నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 23,990 వద్ద ఉన్నాయి.
Stock Market Gains | రెండు మినహా..
బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో రెండు స్టాక్స్ మినహా మిగిలినవన్నీ లాభాలతో సాగుతున్నాయి. రిలయన్స్ 2.12 శాతం, ట్రెంట్ 2.02 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.54 శాతం, అదానీ పోర్ట్స్ 1.51 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 1.42 శాతం లాభాలతో ఉన్నాయి. ఎటర్నల్ 0.58 శాతం, ఎయిర్టెల్ 0.01 శాతం నష్టాలతో ఉంది.
ఇది కూడా చదవండి..: Sep 04 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలకు బూస్ట్..