Congress Party Building | రేపు కాంగ్రెస్​ పార్టీ భవన నిర్మాణానికి భూమిపూజ

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Congress Party Building | నగరంలో కాంగ్రెస్​ పార్టీ (Congress Party) నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరుగనుంది. ముఖ్య​అతిథిగా పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​, అతిథిగా మంత్రి సీతక్క హాజరు కానున్నారు.

Congress Party Building | పాత పార్టీ ఆఫీస్​ ఎదురుగానే..

నగరంలోని రైల్వేస్టేషన్​కు కొద్ది దూరంలో కొన్నేళ్లుగా పార్టీ కార్యాలయం (Party Office) కొనసాగుతోంది. అయితే అద్దె భవనంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం ఇబ్బందిగా మారింది. దీంతో కాంగ్రెస్​ భవన్​ (Congress Bhavan) ఎదురుగానే ఉన్న స్థలంలో ప్రస్తుతం కొత్తగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి డీసీసీ అధ్యక్షుడు కాట్​పల్లి నగేష్​ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్​రెడ్డి, షబ్బీర్​ అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్​ ఉమారాణి, నుడా ఛైర్మన్​ కేశ వేణు, నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి..: Seethakka Kamareddy tour | నేడు కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటన

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *