అక్షరటుడే వెబ్‌డెస్క్: Xi Jinping Health | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల కిర్గిజ్‌స్థాన్‌లో పర్యటించిన ఆయన, విమానం దిగేటప్పుడు భార్య పెంగ్ లియువాన్ చేయి పట్టుకుని నెమ్మదిగా మెట్లు దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన ముఖం ఉబ్బినట్లుగా ఉండటం, నడకలో ఇబ్బంది గమనించడంతో తైవాన్, టిబెట్, ప్రవాస చైనీస్ వర్గాల్లో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
Xi Jinping Health | మూడుసార్లు గుండెపోటు?
టిబెట్ ( Tibet ) ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధానమంత్రి లోబ్సాంగ్ సాంగే ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడి ఆరోగ్యంపై సంచలన విషయాలు బయటపెట్టారు. చైనా ప్రభుత్వానికి చెందిన ఓ అత్యున్నత స్థాయి మాజీ అధికారి తనతో గంటపాటు సమావేశమయ్యారని, ఆ సమయంలో జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారని ఆయన వెల్లడించారు. జిన్‌పింగ్‌కు ఇప్పటికే కనీసం రెండు, మూడుసార్లు గుండెపోటు వచ్చిందని ఆ అధికారి తెలిపినట్లు సాంగే పేర్కొన్నారు.
కొన్ని సందర్భాల్లో జిన్‌పింగ్ మూడు నుంచి ఐదు వారాల పాటు ఎక్కడా కనిపించకుండా పోయి, ఆ తర్వాత అకస్మాత్తుగా బహిరంగ వేదికలపై ప్రత్యక్షం కావడానికి ఈ ఆరోగ్య సమస్యలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాన్ని నడిపించే బరువైన బాధ్యతల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు.
Xi Jinping Health | సైనికాధికారుల తొలగింపు..
చైనా అంతర్గత పరిణామాలపై స్పందిస్తూ.. జిన్‌పింగ్ తన అనుకూల సైనికాధికారులను, రక్షణ మంత్రిని సైతం వరుసగా తొలగించడం లేదా అదృశ్యం చేయడంపై సాంగే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనాలో మంత్రుల కంటే.. జిన్‌పింగ్ చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది, సైనిక నాయకత్వమే అత్యధిక ప్రభావం చూపుతోందని ఆయన చెప్పారు.
Xi Jinping Health | వారసుడి ప్రకటనపై సందిగ్ధత..
చైనాకు తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై జిన్‌పింగ్ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక ప్రకటించలేదని సాంగే తెలిపారు. ఒకవేళ ఆయన తన వారసుడిని ఇప్పుడే ప్రకటిస్తే.. ఆ వ్యక్తి త్వరగానే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే ప్రమాదం ఉందని జిన్‌పింగ్ భావిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో వారసుడిని ప్రకటించకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన అధికార పోరాటం జరిగి దేశంలో అంతర్గత ఘర్షణలు తలెత్తే రిస్క్ ఉందని విశ్లేషించారు.
Xi Jinping Health | టిబెట్ ప్రభుత్వ నేపథ్యం..
చైనా 1950లో టిబెట్‌ను ఆక్రమించుకున్న తర్వాత, 1959లో జరిగిన లాసా తిరుగుబాటు అణచివేత సమయంలో దలైలామాతో పాటు వేలాది మంది టిబెటన్లు భారతదేశానికి తరలివచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోని ధర్మశాల కేంద్రంగా ‘సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్’ (CTA) పేరుతో ప్రవాస టిబెట్ ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే ఈ ప్రభుత్వాన్ని చైనా ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా గుర్తించలేదు.
ఇది కూడా చదవండి: Gutpa Alisagar Irrigation Water | ఫలించిన సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి కృషి.. ఖరీఫ్‌కు నీటివిడుదల