అక్షరటుడే, బోధన్: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్(BRS Bodhan) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో (Bodhan) ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Fee Reimbursement Dues | వెయ్యిరోజుల పాలనపై తీవ్ర వ్యతిరేకత
బోధన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి అయేషా ఫాతిమా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులపై కక్ష సాధించే విధంగా ప్రవర్తిస్తోందన్నారు. విద్య శాఖ సీఎం వద్ద ఉన్నా కూడా విద్యార్థులకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు రావాల్సిన దాదాపు రూ.13,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదన్నారు. విద్యార్థులే రాష్ట్ర అభివృద్ధికి కీలకమని.. అలాంటి విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేయడం సుమంజసం కాదని అయేషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Kerala Car Accident | లారీని ఢీకొన్న కారు.. 8 మంది విద్యార్థుల మృతి