అక్షరటుడే, న్యూఢిల్లీ: Digital Arrest Scams | సామాన్యులతో పాటు ప్రముఖులను సైతం వణికిస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై కేంద్ర ప్రభుత్వం (Central Government) కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ తరహా నేరాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్ (Biometric SIM Verification), అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నిలిపివేత వంటి కీలక మార్పులను ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.
Digital Arrest Scams | కేంద్రం ప్రతిపాదించిన మార్పులు :
బయోమెట్రిక్ తప్పనిసరి: కొత్త సిమ్ కార్డులు జారీ చేసే సమయంలో బయోమెట్రిక్ గుర్తింపును తప్పనిసరి చేయాలని కేంద్రం పేర్కొంది. సిమ్ విక్రయదారుల (పీఓఎస్) వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
వాట్సప్‌లో కొత్త ఫీచర్లు: మోసపూరిత కాల్స్‌ను గుర్తించేందుకు వాట్సప్ వంటి యాప్‌లలో అధునాతన సాంకేతికతను తీసుకురావాలని కేంద్రం సూచించింది. ‘సిమ్ బైండింగ్’ (SIM Binding) విధానాన్ని మరింత పటిష్టం చేయాలని కోరింది.
డివైజ్ ఐడీల బ్లాక్: సైబర్ నేరాలకు ఉపయోగించిన ఫోన్లు, లాప్‌టాప్‌ల వంటి డిజిటల్ డివైజ్ ఐడీలను (IMEI) వెంటనే బ్లాక్ చేయాలి. దీనివల్ల నిందితులు అదే పరికరంతో మరోసారి మోసాలకు పాల్పడకుండా అడ్డుకోవచ్చు.
బ్యాంకు ఖాతాల నిలిపివేత: మోసపూరిత లావాదేవీలు జరుగుతున్నట్లు అనుమానం వస్తే, ఆయా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు డెబిట్ కాకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని ఆర్బీఐని కోరాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
Digital Arrest Scams | సుప్రీంకోర్టుకు అభ్యర్థన:
అటార్నీ జనరల్ ద్వారా సమర్పించిన ఈ నివేదికను పరిశీలించిన అనంతరం.. టెలికాం శాఖ (Telecommunications Department), ఐటీ మంత్రిత్వ శాఖ , ఆర్బీఐ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. నిపుణులు , అధికారులతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇది కూడా చదవండి..: Odisha Bank Incident | సోదరి అస్థిపంజరంతో బ్యాంక్‌కు వెళ్లిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

