Miss World 2026 Winner | మిస్ వరల్డ్-2026 విజేతగా డొమినికన్ రిపబ్లిక్ భామ జోహైరీ మోలా

ఆమె టాప్-40 రౌండ్‌తోనే తన ప్రస్థానాన్ని ముగించి నిష్క్రమించాల్సి వచ్చింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Miss World 2026 Winner | ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ ‘మిస్ వరల్డ్-2026’ గ్రాండ్ ఫినాలే వైభవంగా ముగిసింది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన సుందరి జోహైరీ మోలా (Johairy Mola) కైవసం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పాల్గొన్న సుందరీమణులను వెనక్కి నెట్టి ఆమె ఈ ఘనత సాధించారు.

Miss World 2026 Winner | రన్నరప్​గా ఎవరంటే..

పూర్వపు ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్-2025) సుచాతా చేతుల మీదుగా జోహైరీ మోలా ఈ ప్రతిష్ఠాత్మక విజేత కిరీటాన్ని ధరించారు.
ఈ పోటీల్లో స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రెయిన్స్ (Elizabeth Rains) ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, మలేషియాకు చెందిన టానూసియా చెట్టి (Tanushree/Tanusia Chetty) సెకండ్ రన్నరప్‌గా ఎంపికయ్యారు.

Congress Organisational Reshuffle | కాంగ్రెస్ పార్టీలో భారీ సంస్థాగత మార్పులు.. పలు రాష్ట్రాలకు ఇన్​ఛార్జుల నియామకం

Miss World 2026 Winner | భారత సుందరికి నిరాశ..

ఈ ఏడాది భారత్ తరఫున ప్రతినిధిగా బరిలోకి దిగిన నిఖితా పోర్వాల్ పోటీల్లో ఆకట్టుకున్నప్పటికీ, ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు. ఆమె టాప్-40 రౌండ్‌తోనే తన ప్రస్థానాన్ని ముగించి నిష్క్రమించాల్సి వచ్చింది. మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన జోహైరీ మోలాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ, మోడలింగ్ రంగానికి చెందిన ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *