అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Police Commissionerate | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో(Nizamabad Police) హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఉత్తర్వులు జారీ చేశారు.
Nizamabad Police Commissionerate | హెడ్‌కానిస్టేబుళ్లకు..
11 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సై(సివిల్)గా అడహక్ పదోన్నతులు కల్పిస్తూ పోలీస్‌కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిని వివిధ పోలీస్స్టేషన్లలో పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతి పొందిన వారిలో ఎస్ గంగాధర్ రావు(నందిపేట్), రాజేశ్వర్ (వేల్పూర్), పి. మోహన్(డబ్ల్యూపీఎస్,నిజామాబాద్), జగదీశ్వర్(పీసీఆర్, నిజామాబాద్), చిన్న సాయిలు (బోధన్ రూరల్ పీఎస్), రాజశేఖర్(ధర్పల్లి), రాజేందర్(సిరికొండ), సుదర్శన్(టౌన్–1 పీఎస్ నిజామాబాద్) డేనియల్ భాస్కర్(బోధన్ టౌన్), సుంకన్న (నందిపేట్), మల్లేశం(రెంజల్) ఉన్నారు. పదోన్నతి పొందిన సిబ్బంది వెంటనే ఆయా స్థానాల్లో రిపోర్ట్ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సంచలన సవాల్