KCR BRSLP Meeting | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

అసెంబ్లీ, మండలి సమావేశాలపై గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KCR BRSLP Meeting |  అసెంబ్లీ, మండలి సమావేశాలపై గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష (BRSLP) సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో సోమవారం నుంచి మొదలుకానున్న ఉభయసభల సమావేశాల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.

KCR BRSLP Meeting | కేసీఆర్ దిశానిర్దేశం ..

ఈ కీలక భేటీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న తరుణంలో.. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలు, రైతు ఇబ్బందులు తదితర అంశాలపై అసెంబ్లీలో ఏ విధంగా గళం వినిపించాలనే దానిపై ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ఏ విధంగా కార్నర్ చేయాలనే దానిపై ఈ సమావేశంలో సమగ్ర కార్యాచరణను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: Delhi Hostel Collapse | ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్​.. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *