Delhi Building Collapse | ఢిల్లీలో భవనం కూలిన ఘటన.. మూడు మృతదేహాల వెలికితీత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

తమను రక్షించాలంటూ కొందరు బాధితులు ఫోన్ల ద్వారా కుటుంబ సభ్యులకు, అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi Building Collapse | దేశ రాజధాని ఢిల్లీలో భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. శిథిలాల కింద చిక్కుకున్న 15 మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Delhi Building Collapse | ఇంకా విద్యార్థుల ఆర్తనాదాలు..

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమను రక్షించాలంటూ కొందరు బాధితులు ఫోన్ల ద్వారా కుటుంబ సభ్యులకు, అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Delhi Hostel Collapse | ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్​.. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులు

మరోవైపు.. శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఆర్తనాదాలు వినిపిస్తున్నట్లు సమాచారం. దీంతో వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. వెలుతురు, శిథిలాల తొలగింపు వంటి సవాళ్ల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Delhi Building Collapse | ఢిల్లీ ముఖ్యమంత్రి పరామర్శ

ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రిలో ఢిల్లీ ముఖ్యమంత్రి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని నిర్ధారించేందుకు రెస్క్యూ బృందాలు జాగ్రత్తగా గాలింపు చేపడుతున్నాయి. పూర్తి వివరాలు అధికారుల నుంచి వెలువడాల్సి ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *