అక్షరటుడే, వెబ్డెస్క్: Mahesh Goud Comments | సుస్మిత చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ అప్పుడే ఖండించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు.
క్రమశిక్షణ విషయంలో కులం, మతం, చిన్నాపెద్దా అనే తేడాలు ఉండవని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
Mahesh Goud Comments | క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం
క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే హైకమాండ్ నిర్ణయం తీసుకుందని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పలు అంశాలను ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: EHS Scheme | ఈహెచ్ఎస్పై భట్టి విక్రమార్క సమీక్ష
కొండా సురేఖను రాజీనామా చేయాలని తాను చెప్పలేదని మహేష్ గౌడ్ వెల్లడించారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు ఎవరికీ రాజకీయ రక్షణగా ఉండరని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన మహేష్ గౌడ్.. గీత దాటితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తేల్చి చెప్పారు.