Seethakka Comments | స్పీకర్‌ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలి: మంత్రి సీతక్క

శాసనసభాపతిని దూషించిన వ్యక్తులను సభ నుంచి బహిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శాసనమండలిలో తీవ్రంగా డిమాండ్ చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Seethakka Comments | శాసనసభాపతిని దూషించిన వ్యక్తులను సభ నుంచి బహిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శాసనమండలిలో తీవ్రంగా డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన మండలి సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తిస్తూ నెట్టివేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Seethakka Comments | బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది..

మహిళా ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాలు ఎదిగితే ఓర్చుకోలేని భూస్వామ్య విధానం బీఆర్ఎస్‌ది అని విమర్శించారు. ఒకవైపు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూనే.. మరోవైపు ఇదే అంశాన్ని అడ్డుపెట్టుకుని స్పీకర్‌ను అవమానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

Seethakka Comments | వీళ్లకు తల్లులు లేరా?

సభలో బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై సీతక్క తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. “కేటీఆర్  ( KTR )మహిళా పోలీసులపై చేతులు వేశారు. ఎస్సీ, ఎస్టీలను దూషిస్తే చట్టాలు వర్తిస్తాయి. వీళ్లకు తల్లులు లేరా? అసెంబ్లీలో హరీష్ రావు స్పీకర్ మీదకు దూసుకెళ్తున్నారు.. ఏం, స్పీకర్‌ను కొడతారా?” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో స్పీకర్‌పై దాడి చేశారంటూ నాటి కాంగ్రెస్ సభ్యులపై ఆర్టికల్ 194(3) కింద చర్యలు తీసుకున్నారని, అదే రూల్‌ను ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సభలో నైతిక విలువలు, సంప్రదాయాలు పాటించకుండా ఇప్పటివరకు స్పీకర్‌కు క్షమాపణ కూడా చెప్పకపోవడంపై బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: MLA Prashanth Reddy | కేసీఆర్​పై దాడి చేసేందుకు కాంగ్రెస్​ ప్లాన్​: మాజీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *