అక్షరటుడే, వెబ్డెస్క్ : Koil Alwar Tirumanjanam | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత పవిత్రమైన కొయ్యిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సిద్ధం చేసే క్రమంలో, స్వామివారి ఆలయాన్ని మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు సంప్రదాయబద్ధంగా నీటితో శుద్ధి చేశారు. అనంతరం ఆలయ గోడలకు పరిమళం అనే సుగంధ ద్రవాన్ని లేపనం చేశారు. టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత అని అన్నారు.
Koil Alwar Tirumanjanam | ప్రత్యేక పూజలు
ఆలయ శుద్ధి అనంతరం అర్చకులు మూలవిరాట్టుకు ప్రత్యేక నివేదన, కైంకర్యాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నూతన పరదాలను సమర్పించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ttd బోర్డ్ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఆకాంక్షించారు. లోక కల్యాణం చేకూరాలని ప్రార్థించారు. ఈ వేడుకల్లో additional EO ch. వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Supreme Court Teacher Recruitment | అర్హత లేని వారికి టీచర్ పోస్టులా?.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు