అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ramavath Lalsingh PhD | జిల్లాలోని చందూర్ మండలం కారేగాం తండా గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందిస్తున్న రమావత్ లాల్‌సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) హిందీ విభాగంలో ‘సమకాలీన హిందీ ఉపన్యాస్ మే సాంప్రదాయిక్ సంఘర్ష్’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసిన ఆయనకు ఓయూలో నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు.
Ramavath Lalsingh PhD | గవర్నర్ చేతుల మీదుగా…
విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమంలో తెలంగాణ (Telangana) గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, భారతీయ బయోటెక్నాలజీ (Indian Biotechnology) ఛైర్మన్ డా.కృష్ణ మిలా, వీసీ మొగలయ్య చేతుల మీదుగా రమావత్ లాల్‌సింగ్ డాక్టరేట్ పట్టా స్వీకరించారు. ఒకవైపు గ్రామ సర్పంచ్‌గా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధికి కృషి చేస్తూనే, మరోవైపు ఉన్నత విద్యను కొనసాగించి పీహెచ్‌డీ సాధించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రమావత్ లాల్‌సింగ్ మాట్లాడుతూ తన పరిశోధనకు సహకరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: అమలాపురంలో ఆక్వా రైతులు ఆందోళన చేశారు.