అక్షరటుడే వెబ్‌డెస్క్: Jagan Padayatra | వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన పాదయాత్ర పై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ యాత్రను ప్రారంభించే అవకాశం ఉందని తెలపడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవుతోంది. గతంలో జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక మలుపుగా నిలిచింది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రారంభమైన ఈ యాత్ర.. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. దాదాపు 16 నెలల పాటు సాగిన ఈ సుదీర్ఘ యాత్రలో ఆయన సుమారు 3,648 కిలోమీటర్లు నడిచారు.
Jagan Padayatra | ప్రజల మధ్యే పాదయాత్ర..
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ రాష్ట్రంలోని 13 జిల్లాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల్లో పర్యటించారు. రోజుకు సగటున 12 నుంచి 20 కిలోమీటర్ల మేర నడుస్తూ రైతులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది, నిరుద్యోగ యువతతో పాటు వివిధ వర్గాల ప్రజలను నేరుగా కలిశారు. ఈ యాత్రలో 500, 1000, 2000, 3000 కిలోమీటర్ల మైలురాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అయితే, 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌పై కోడికత్తితో జరిగిన దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశం కావడంతో యాత్రకు కొంతకాలం విరామం ఏర్పడింది.
Jagan Padayatra |చారిత్రక విజయం..
ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్న సమస్యల ఆధారంగానే వైసీపీ ‘నవరత్నాలు’ హామీలను రూపొందించింది. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు ఎన్నికల ప్రచారంలో అత్యంత కీలకమయ్యాయి. యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో 91 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించారు.
ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించి, 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. జగన్ రాజకీయ ప్రస్థానంలో ఈ యాత్ర తెచ్చిన మార్పు దృష్ట్యా, ఇప్పుడు మరోసారి ‘ ఆయన ప్రజల్లోకి వస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
YSRCP supremo and former CM #YSJagan announces a statewide Padayatra from September–October 2027, ahead of the 2029 Assembly elections. #AndhraPradesh pic.twitter.com/opI2N8icqh
— Ashish (@KP_Aashish) September 9, 2026
ఇది కూడా చదవండి: Joint Cheque Power | సర్పంచ్‌తో పాటు కార్యదర్శికి చెక్‌పవర్ ఇవ్వాలి