అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | గ్లోబల్ మార్కెట్లు (Global Markets) బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అయితే భారతీయ స్టాక్ మార్కెట్ మాత్రం స్వల్ప మార్పులతో ఫ్లాట్‌గా కదలాడుతోంది.
Indian Stock Market | 15 పాయింట్ల నష్టంతో
ఉదయం సెన్సెక్స్ 22 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 168 పాయింట్లు పెరిగింది. అక్కడి నుంచి 244 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 48 పాయింట్లు పెరిగింది. అనంతరం ప్రాఫిట్ బుకింగ్‌తో 91 పాయిట్లు కోల్పోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో 74,749వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 23,422 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 16 స్టాక్స్ లాభాలతో, 14 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. టెక్ మహీంద్రా 1.45 శాతం, పవర్‌గ్రిడ్ 1.39 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.82 శాతం, ఎయిర్టెల్ 0.43 శాతం, ఎన్టీపీసీ 0.42 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్‌సీఎల్ టెక్ 1.44 శాతం, టాటా స్టీల్ 1.09 శాతం, ఇండిగో 0.96 శాతం, సన్‌ఫార్మా 0.89 శాతం, రిలయన్స్ 0.71 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: LCC Projects IPO | ఎల్సీసీ.. జీఎంపీ పైపైకి..