అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Petrol Price Hike | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి తర్వాత దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఎన్నికల ఉపశమనం ముగిసిందని, ద్రవ్యోల్బణం వేడి రాబోతోందని ఆయన అన్నారు. ఏప్రిల్ 29 తర్వాత పెట్రోల్, డీజిల్, ప్రతీదీ ఖరీదైపోతుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. చమురు చౌకగా ఉన్నప్పుడు మోదీ (Modi) ప్రభుత్వం లాభాలను జేబులో వేసుకుందని. ఇప్పుడు అది ఖరీదై, ఆ భారాన్ని ప్రజలపై మోపనుందని పేర్కొన్నారు. రేపటితో బెంగాల్ ఎన్నికలు (Bengal Elections) ముగియనున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Petrol Price Hike | ఖండించిన కేంద్రం
ఎన్నికలు ముగిశాక పెట్రోల్ ధరలు పెరుగుతాయనే ప్రచారాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇప్పట్లో ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయినా కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం గమనార్హం. రేపు బెంగాల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి నష్టం చేకూర్చేలా ఆయన ట్వీట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇంధన నిల్వలకు సంబంధించి ఎలాంటి కొరత లేదని భరోసా ఇచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్‌లో పెట్రోల్, డీజిల్ నుంచి ఎల్పీజీ , విమాన ఇంధనం వరకు అన్నీ తగినంత స్థాయిలో ఉన్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.
चुनावी राहत खत्म, महंगाई की गर्मी तैयार!
29th April के बाद देखिए – पेट्रोल, डीज़ल, सब महंगे होंगे।
जब तेल सस्ता था, मोदी सरकार ने अपना मुनाफ़ा रखा। अब महंगा है, तो बोझ आप पर डालेगी।
सस्ते की लूट मचाती सरकार – जनता को बस महंगाई की मार।
— Rahul Gandhi (@RahulGandhi) April 28, 2026
ఇది కూడా చదవండి : SBI Bank Robbery | ఎస్బీఐలో భారీ దోపిడీ.. తుపాకీతో బెదిరించి రూ. 50 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు!


[…] […]